Mahaa Daily Exclusive

  చల్లా వంశీచంద్ రెడ్డికి కీలక బాధ్యతలు..!

Share

కాంగ్రెస్ ముఖ్య నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి కట్టబెట్టింది. దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుందో లేదో పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్(ఈగల్) అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ కే. సీ వేణుగోపాల్ పత్రికా ప్రకటన జారీ చేశారు. ఈ కమిటీ మొదట మహారాష్ట్రలో గల్లంతైన ఓటర్ల జాబితా విషయం మీద విచారణ జరిపి, వీలైనంత త్వరగా నాయకత్వానికి వివరణాత్మక నివేదికను సమర్పించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఈ కమిటీని 8 మంది బృంద సభ్యులతో ఏర్పాటు చేయగా.. తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి కూడా ఈ కమిటీలో చోటు దక్కింది. ఈ కమిటీలో అజయ్ మాకెన్, దిగ్విజయ్ సింగ్, అభిషేక్ సింఘ్వి, ప్రవీణ్ చక్రవర్తి, పవన్ ఖేరా, గుర్దీప్ సింగ్ సప్పల్, నితిన్ రావుత్, చల్లా వంశీచంద్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.

Latest