Mahaa Daily Exclusive

  గ్రేటర్ హైదరాబాద్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష…!

Share

సీఎం రేవంత్ రెడ్డి తో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో గ్రేటర్ హైదరాబాద్ లో చేపడుతున్న పలు ప్రాజెక్టుల పైన కీలక సమీక్ష చేశారు. మీరాలం చెరువు పై నిర్మిస్తున్న బ్రిడ్జి పైన అధికారులకు పలు సూచనలుచేశారు. 90 రోజుల్లో బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. 30 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో అత్యంత ప్రముఖ ప్రాంతంగా మీరాలం బ్రిడ్జి ని తీర్చిదిద్దాలని సూచించారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2.425 కిలోమీటర్ల బ్రిడ్జి నిర్మాణం కోసం మూడు ప్రతిపాదనలను అధికారులు చేశారు. హైదరాబాద్ లో నిర్మిస్తున్న కొత్త ప్లై ఓవర్ల పై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల  వెడల్పు పైన పలు సూచనలు ముఖ్యమంత్రి చేశారు. రెండు రోజుల్లో సమగ్ర సమాచారంతో రావాలని సీఎం సూచించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ , జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు , ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.