Mahaa Daily Exclusive

  తెలంగాణ బిజెపి పగటికలలు ఈ రాష్ట్రంలో మీకు అంత సీన్ లేదు – పీసీసి చీప్ మహేష్ కుమార్ గౌడ్

Share

బీజేపీ నాయకులు ఢిల్లీ ఫలితాలను తెలంగాణతో పోలుస్తూ పగటికలలు కంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ ఫలితాల నేపథ్యంలో బిజెపి, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ లో ఉన్న పరిస్థితులు ఢిల్లీలో ఉన్న పరిస్థితులువేరు వేరని, తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. కేటిఆర్ బీజేపీ ని అభినదించలేక లోలోపల ఆనంద పడుతున్నాడని, తెలంగాణలో కేసీఆర్, కేటిఆర్ శకం ముగిసిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇస్తున్న ఆరు గ్యారంటీలు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని, మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు మరొకసారి పట్టం కడతారన్నారు. రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకుంటుందని, కర్ణాటక, తెలంగాణా లో ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తున్నారన్నారు. భవిషత్తులో కూడా ఆదరిస్తారన్నారు. కవిత లిక్కర్ స్కామ్ వల్లే ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోయారని, అవినీతి నేతలపై ప్రజల ఉపేక్ష ఉండదన్నారు.