- బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు
- బీజేపీకి ఏం సంబంధమన్న రాంచందర్ రావు
- చట్టం తన పని తాను చేసుకుంటుందని వెల్లడి
హైదరాబాద్, మహా : గత కొన్ని రోజులుగా రాషఅట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వెంటనే ఈ ఘటనపై చర్యలు చేపట్టాలని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే మే 8వ తేదీనే బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చినా.. పోలీసులు ఎందుకు చర్యలు చేపట్టలేదని సీఎం నిలదీశారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. ఈ ఘటన కేవలం బండి సంజయ్ ఫ్యామిలీకి సంబంధించిన అంశమని.. బీజేపీలో జరిగింది కాదని తేల్చి చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు బండి భగీరథ్ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. కొంతమంది అనవసరంగా ఈ విషయాన్ని బీజేపీకి అంటగడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. బండి భగీరథ్ కేసులో బండి సంజయ్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంటే విచారణ జరిపించాలన్నారు. ఇది న్యాయపరమైన అంశమని, ఈ విషయంలో చట్టం చేయాల్సిన పని చేస్తుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు.
సభ సక్సెస్ పై హర్షం
మరోవైపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ సక్సెస్ కావడం పట్ల రాంచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సభ విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని సభ పార్టీకి, శ్రేణులకు పెద్ద బూస్టప్ అని అన్నారు. ప్రదాని పర్యటన సందర్భంగా కొంత మంది కావాలని రాద్దాంతం చేసేందుకు ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. ప్ఱధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ ఇంత కాలం విమర్శించిన వారంతా నిన్నటి ప్రధాని పర్యటన తర్వాత వాస్తవాలు తెలిసి ఉంటాయని అనుకుంటున్నానని అన్నారు.








