మహా పత్రిక ఎఫెక్ట్
కొండాపూర్ సర్వే నెంబర్ 59గల్లంతుపై అక్షరపోరాటం
మహా కధనానికి.. మహా స్పందన..
ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న భవనం స్వాధీనం
తేలుకుట్టిన దొంగల్లా కబ్జా దారులు
మహా పత్రికకు జే జే లు పలికిన స్థానికులు
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు :తహసీల్దార్ మహిపాల్ రెడ్డి
భూ కబ్జాదారులపై రెవెన్యూ అధికారులు ఉక్కు పాదం మోపారు.. శేలింగం పల్లి మండలం మాదాపూర్ సర్కిల్ కొండాపూర్ లో ప్రభుత్వ సర్వే నెంబర్ 59 గల్లంతు పై మహా పత్రిక ఈ నెల 11న పూర్తి ఆధారాలతో వరుస కధనాలను ప్రచురించింది. వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టారు. ఆ విచారణలో విస్తూ పోయె విషయాలు వెలుగులోకి వచ్చినట్లు వారు తెలిపారు.. నకిలీ పత్రాలు సృష్టించి సర్వే నెంబర్ 60 లో నిర్మాణాలు చేస్తున్నట్లు జి హెచ్ ఎం సీ నుండి అనుమతులు పొంది పక్కనే ఉన్న ప్రభుత్వ సర్వే నెంబర్ 59 లో నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు..సర్వేయర్ తో సర్వే చేయించటం ద్వారా నిర్మిస్తున్న భవనం సర్వే నెంబర్ 59 లో వస్తుందని నిర్ధారణ కావటంతో పంచనామా చేసి భూమితో పాటు భవనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు.. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన మహా పత్రికకు స్థానికులు జే జే లు పలికారు








