Mahaa Daily Exclusive

  కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం…

Share

  • కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
  • మద్దతు ధర పేరుతో కేంద్రం దగా

కారేపల్లి, మహా : కేంద్ర ప్రభుత్వం రైతాంగం పండించిన పంటలకు ఎం.ఎస్.పి పేరుతో నామమాత్రపు ధరను నిర్ణయించడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి, మాస్ లైన్ ఆద్వర్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ, మద్దతు ధర జీవో పత్రాలను దహనం చేశారు. పేరుపల్లి హాలియా తండా వద్ద వేరువేరుగా జరిగిన కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ, మాస్ లైన్ నాయకులు పాల్గొని మాట్లాడారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా నామమాతకు మద్దతు ధర పెంచి రైతులను మోసం చేస్తుందని విమర్శించారు కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై ప్రకాష్, నాయకులు కోయల శ్రీను, కంచర్ల శ్రీనివాసరెడ్డి, వై జానకి, కావేటి నాగేశ్వరరావు, ఆలెం చంద్రయ్య, మాస్ లైన్ నాయకులు గుగులోత్ తేజ నాయక్, ధారావత్ సక్రు, పులకాని సత్తిరెడ్డి, రావుల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.