- దాడిని ఖండించిన టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఊటు యశ్వంత్..
- దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి…
- ఆర్ఐకి జిపీఓకు అండగా టీఎన్జీవో సంఘం: యశ్వంత్
ఇబ్రహీంపట్నం జూన్ 20 మహా:
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ లో ఆర్ఐ ఫై ఓ మహిళ దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని, టిఎన్జీవో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఊటు యశ్వంత్ తెలిపారు. తుర్కయంజాల్ సర్వే నెంబర్ 338లో 1810 వివాదం గల భూవిషయంలో పై అధికారుల ఆదేశాల మేరకు భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని వెళ్ళగా, అక్కడ ఉన్న మహిళ ఆర్ఐ, జిపిఓను గల్లా పట్టుకొని ఈడ్చి కెల్లటాని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భూమిని కాపాడడం కోసం వెళితే ఇలాంటి దారుణాలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. వెంటనే బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. ఆర్ఐ ప్రేమ్ కుమార్, జిపిఓ హనుమంతుకు న్యాయం జరిగే వరకూ టీఎన్జీవో సంఘం అండగా ఉంటుందని తెలిపారు.
Post Views: 68








