తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ టీటీడీసీలో నిర్వహించిన జిల్లా జర్నలిస్టుల రెండు రోజుల శిక్షణ తరగతుల్లో పాల్గొని ఆధునిక జర్నలిజంలో ఏఐ టూల్స్ వినియోగం, ఫేక్ న్యూస్ గుర్తింపు, ఫ్యాక్ట్ చెకింగ్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ అందించాను.
ఏఐ మన పనిని వేగవంతం చేయగలదు. సమాచారాన్ని విశ్లేషించడంలో సహాయపడగలదు. కానీ ఇదే సమయంలో ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్‌లను గుర్తించడంతో పాటు వార్తల విశ్వసనీయతను కాపాడటం, వాస్తవాలను నిర్ధారించడం, జర్నలిజం నైతిక విలువలను పాటించడం.. వంటి అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చాను.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి గారికి, సెక్రటరీ వెంకటేశ్వరరావు గారికి, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారికి, నిర్వాహకులకు, పాల్గొన్న జర్నలిస్టు మిత్రులందరికీ ధన్యవాదాలు.
సాంకేతికత మారుతుంది.. జర్నలిజం రూపం మారుతుంది.. కానీ వాస్తవాల పట్ల నిబద్ధత ఎప్పటికీ మారకూడదు!








