కారేపల్లి, మహా: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ఇల్లందు నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా కామేపల్లి మండలంలో అభివృద్ధి పనులు ప్రారంభించి కారేపల్లి క్రాస్ రోడ్ మీదుగా ఇల్లందు వెళ్లారు. కారేపల్లి క్రాస్ రోడ్ లో భట్టి విక్రమార్క కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఈ ప్రాంతంకు వచ్చిన భట్టి, కారేపల్లి క్రాస్ రోడ్ లో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాసు నాయక్ కోరిక మేరకు కారు దిగారు. భట్టి విక్రమార్క కు కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు శాలవలు, పూలమాలతో ఘన స్వాగతం పలికారు. బట్టికి స్వాగతం పలకడానికి భాగ్యనగర్ తండా నుండి సర్పంచ్ భానోత్ హీరాలాల్ ఆధ్వర్యంలో కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీతో క్రాస్ రోడ్ తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తోటకూరి రాంబాబు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు భూక్య రంజిత్ కుమార్, సర్పంచులు మేదరి వీర ప్రతాప్ ఇస్లావత్ రాజు వాంకుడోత్ హనుమంతరావు, హేమలత, కాంగ్రెస్ నాయకులు బానోతు రామ్మూర్తి, బానోత్ దేవ్లానాయక్, అడ్డగోడ ఐలయ్య పెద్దబోయిన ఉమాశంకర్, గుడిపూడి తిరుమల రావు, నర్సింగ్ శ్రీనివాసరావు, విష్ణువర్ధన్ రెడ్డి, యాకూబ్ అలి, నాగండ్ల జగన్, అజ్మీర నరేష్ తదితరులు పాల్గొన్నారు.








