మోదీపై రాఖీ సావంత్ కామెంట్ వైరల్.
* మెలోని పోస్టు కింద ఆసక్తికర వ్యాఖ్య.
ముంబై, మహా.
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చేసిన ఓ సోషల్ మీడియా కామెంట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. సీజేపీ నిర్వహించిన నిరసనకు మద్దతు ప్రకటించిన ఆమె, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సోషల్ మీడియా పోస్టు కింద చేసిన వ్యాఖ్య ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పరోక్షంగా ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్‌పై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
బాలీవుడ్‌లో ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు పొందిన రాఖీ సావంత్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులతో తరచూ వార్తల్లో నిలిచే ఆమె తాజాగా జార్జియా మెలోని వీడియోకు స్పందిస్తూ.. “మీ బాయ్‌ఫ్రెండ్‌కు రాజీనామా చేయమని చెప్పండి.. దయచేసి మీరైనా అడగండి” అంటూ కామెంట్ చేశారు.
రాఖీ సావంత్ వ్యాఖ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించిందేనని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చిస్తున్నారు. గతంలో అంతర్జాతీయ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కలిసి కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఆ సందర్భాలను ఆధారంగా చేసుకుని మీమ్స్, సరదా పోస్టులు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి.
తాజాగా రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యతో మరోసారి మోదీ–మెలోని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికలపై ట్రెండ్ అవుతున్నాయి. ఆమె వ్యాఖ్యపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, సోషల్ మీడియాలో ఇది మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.







