కారేపల్లి, మహా:ఎల్నీనో ప్రభావం దృష్ట్యా నీటి ఎద్దటి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవటానికి సింగరేణి మండలం మాధారం గ్రామపంచాయతీలో ఎంపీఓ రవీంద్ర ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేందర్ లు పర్యటించారు. వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో ముందస్తు చర్యలో భాగంగా వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారించేందుకు ప్రత్యమాయ మార్గాల కోసం కృషి చేయాలని సర్పంచ్ అజ్మీర్ ఉమా నరేష్ కు సూచించారు. మాదారంలో మినరల్ వాటర్ ప్లాంటు పని తీరును పరిశీలించి సర్పంచ్ ను ప్రశంసించారు. పంచాయతీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. పాత బోర్ల మరమ్మతులు చేయించి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ విజయ్, కాంగ్రెస్ నాయకులు అజ్మీర నరేష్, గుర్రం నర్సింహారావు, కాసాని లక్ష్మీనారాయణ, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 163








