గుర్రం జాషువాకు బీజేపీ నివాళి.
• ఆయన ఆశయాలు భావితరాలకు చేరాలి.
• బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్.
విశాఖపట్నం, మహా.
మహాకవి గుర్రం జాషువా ఆశయాలు భావితరాలకు తీసుకువెళ్లాల్సిన గురుతరబాధ్యత మనపై ఉన్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్ అన్నారు. శుక్రవారం మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా విశాఖపట్నంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక చైతన్యం, సమానత్వ భావనలను ప్రజల్లో నాటిన గుర్రం జాషువా ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడిన తెలుగు సాహిత్యంలో గుర్రం జాషువా అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన రచనలు సమాజానికి మార్గదర్శకంగా నిలిచాయని, ముఖ్యంగా గబ్బిలం వంటి అమూల్యమైన కావ్యం ద్వారా సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూ మానవతా విలువలను చాటిచెప్పారని గుర్తు చేశారు.
మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వారి స్ఫూర్తితో సమాజ సంక్షేమానికి మరింత అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి ప్రకాశ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రొణంకి విజయచంద్రలను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు పరశురామరాజుతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల పదాధికారులు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.








