కారేపల్లి, మహ: తెలంగాణ ఉద్యమ పితామహుడు , సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి వేడుకను కారేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. గురువారం జరిగిన ఈ జయంతి వేడుకలలో ముందుగా జయశంకర్ చిత్రపటానికి అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ చూపించిన పోరాట ప్రతిమను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి పద్మావతి,ఎంపీ ఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, సూపర్డెంట్ మల్లెల రమేష్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాలరావు, తో పాటు పలువురు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 17








