మీ తల్లిదండ్రుల కలలను నిజం చేసే బాధ్యత మీదే..!
“నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తారా”?…
లేక విజయానికి ఇప్పుడే శ్రీకారం చుడతారా?
ఇబ్రహీంపట్నం యువతకు అభిషేక్ రెడ్డి సందేశం..
ఇబ్రహీంపట్నం ఆగస్టు 7 మహా:
ఈరోజుల్లో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే మహాసముద్రాన్ని ఈది తీరం చేరినంత కష్టం. ఒక్క పోస్టు కోసం వేలాది మంది పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలుపెడితే సమయం సరిపోదని మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి అన్నారు.
యువత కోసమే “మల్ రెడ్డి యువశక్తి” మరియు “యంఆర్ఆర్ ఫౌండేషన్” ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు నోటిఫికేషన్ కు ముందుగానే ఉచిత శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాం అని యువ నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి తెలిపారు.
కొంతమంది “మన జిల్లాకు పోస్టులు లేవు, నోటిఫికేషన్ రాలేదు… ఇప్పుడే శిక్షణ ఎందుకు?” అని ప్రశ్నిస్తున్నారు. నా సమాధానం ఒక్కటే…నోటిఫికేషన్ అనేది మీ చేతిలో లేదు. దాని కోసం ఎదురుచూసేవారు పోటీలో నిలబడతారు… ముందుగానే సిద్ధమయ్యేవారే విజేతలుగా నిలుస్తారు.
ఇప్పుడు నేను ప్రతి యువకుడిని ఒక్క ప్రశ్న అడుగుతున్నాను…
నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తారా…? లేక మీ తల్లిదండ్రుల కలలను నిజం చేసేందుకు, మీ ప్రభుత్వ ఉద్యోగ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా…? నిర్ణయం మీదే… కానీ గుర్తుంచుకోండి.. అవకాశం వచ్చిన తర్వాత సిద్ధమవడం కాదు… అవకాశం రాకముందే సిద్ధంగా ఉండటమే విజయానికి తొలి మెట్టు.
Post Views: 5








