మంగళగిరి, మహా :
ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌కు రంగం సిద్ధమవుతున్న వేళ, మంగళగిరికి చెందిన యువ క్రికెటర్ వాసవి అఖిల పావని ‘రాయలసీమ జెన్ స్టార్స్’ జట్టుకు ఎంపిక కావడం పట్ల రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. టోర్నమెంట్‌లో పాల్గొంటున్న క్రీడాకారిణులందరికీ ఆయన తన అభినందనలు తెలిపారు. ఏపీఎల్ ఉమెన్ క్రికెట్ లీగ్ ఆటగాళ్ల వేలంలో మంగళగిరికి చెందిన వాసవి అఖిల పావనిని రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు దక్కించుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన యువతి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో అవకాశం దక్కించుకోవడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.








