Mahaa Daily Exclusive

  అమెరికాలో తెలుగు యువతి కేసులో కీలక పరిణామం..! ఆగ్రాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్..

Share

హైదరాబాద్, మహా : అమెరికాలో తెలుగు యువతి నిఖిత గోదిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న అర్జున్ శర్మ(27) ను పోలీసులు అరెస్ట్ చేశారు.హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్‌లోనూ శర్మపై కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో ఆగ్రాలో శర్మ ఆచూకీ గుర్తించారు ఆగ్రాలోని అపార్ట్‌మెంట్‌లో దాక్కున్న అర్జున్ శర్మను ఆగస్టు 24 న పట్టుకున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిఖిత హత్య కేసులో శర్మపై అభియోగాలున్నాయి. మాజీ ప్రియురాలు నిఖితను హత్య చేసినట్లు అమెరికా పోలీసుల ఆరోపించారు. రూ.వేల డాలర్ల ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమా? 2025 డిసెంబర్ 31న నిఖితను అపార్ట్‌మెంట్‌కు పిలిచిన శర్మ 4 వేల డాలర్లు తిరిగి ఇస్తానంటూ నిఖితను పిలిచినట్లు ఆరోపణలు వచ్చాయి. నిఖిత హత్య అనంతరం ఆమె క్రెడిట్ కార్డుతో డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. అపార్ట్‌మెంట్‌లోని సూట్‌కేసులో నిఖిత మృతదేహం గుర్తించిన అమెరికా పోలీసులు. హత్య అనంతరం భారత్‌కు పరారైనట్లు అమెరికా దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అమెరికా పోలీసులు అర్జున్ శర్మపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్‌లోనూ శర్మపై కేసు నమోదు అయ్యింది. .దర్యాప్తులో భాగంగా ఆగ్రాలో శర్మ ఆచూకీ గుర్తించిన తెలంగాణ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ఆగ్రాలో అరెస్ట్ చేశారు. ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో శర్మను హాజరుపరిచిన అధికారులు అమెరికా అభ్యర్థన మేరకు అప్పగింత ప్రక్రియ ప్రారంభించారు. భారత్-అమెరికా నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

Latest