కారేపల్లి, మహ : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీలో సింగరేణి మండల సీనియర్ నాయకులు, పొలంపల్లి మాజీ సర్పంచ్ దారావత్ భద్రు నాయక్ స్ధానం లభించింది. జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా భద్రు నాయక్‌ను పార్టీ అది నాయకత్వం నియమించింది. నమ్ముకున్న పార్టీను విడకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలుస్తూ ప్రజా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న భద్రు నాయక్ సముచిత స్థానం ఇచ్చిందని మండల సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. డీసీసీ కార్యదర్శిగా నియమితులైన దారావత్ భద్రు నాయక్ను భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోత్ హీరాలాల్, జిల్లా నాయకులు భీముడు నాయక్, మండల నాయకులు భగవాన్ దాస్, రాందాస్ నాయక్ తారాచంద్, బాబు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు హర్ష నాయక్, మండల పార్టీ కో ఆర్డినేటర్ గాంధీ, ఉప సర్పంచ్ భిక్కులాల్, ఈర్య నాయక్, మోతిలాల్, మహేష్, సుమ, పద్మ, భూలి, జ్యోతిలు అభినందించారు.








