వరంగల్, మహా ;
వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మట్వాడ పోలీస్ స్టేషన్ లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా
మహిళా పోలీస్ అధికారులు, తోటి సిబ్బంది తో రాఖీ లు కట్టించుకుని మిఠాయిలు అందజేసి పవిత్రమైన రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
ఈ వేడుకలు పోలీస్ కుటుంబంలో సోదరభావం, పరస్పర గౌరవం, ఐక్యతా స్నేహభావానికి ప్రతీకగా నిలిచాయని వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు ఇన్స్పెక్టర్ ఎన్. కరుణాకర్ రావు తెలిపారు.








