Mahaa Daily Exclusive

  కోఆప్ష‌న్ ఎన్నిక వాయిదా..! ఎమ్మెల్యే పాయల్ శంక‌ర్ భూకబ్జాల‌పై విచార‌ణ జ‌రిపించాలి..

Share

  • కోఆప్ష‌న్ ఎన్నిక వాయిదా
  • ఎమ్మెల్యే పాయల్ శంక‌ర్ భూకబ్జాల‌పై విచార‌ణ జ‌రిపించాలి
  • ఆ త‌ర్వాత‌నే కోఆప్ష‌న్ స‌భ్యుల ఎన్నిక నిర్వహించాలి
  • పోడియం వ‌ద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం కౌన్సిల‌ర్ల నినాదాలు
  • స‌భ జ‌రిగే అవ‌కాశం లేక పోవ‌డంతో వాయిదా వేస్తున్న‌ట్టు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ వెల్ల‌డి

ఆదిలాబాద్ మ‌హా : ఆదిలాబాద్ మున్సిప‌ల్ కోఆప్షన్ ఎన్నిక వాయిదా ప‌డింది. ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో స‌భ్యుడు పాయ‌ల్ శంక‌ర్ భూకబ్జాల‌పై విచార‌ణ జ‌రిపించిన త‌ర్వాత‌నే మున్సిప‌ల్ కోఆప్ష‌న్ స‌భ్యుల ఎన్నిక నిర్వ‌హించాల‌ని సోమ‌వారం మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ తో పాటు పాల‌క ప‌క్ష కూట‌మి స‌భ్యులు పోడియం వద్ద నినాదాలు చేసారు. కౌన్సిల‌ర్లు బ‌య‌ట‌కు వ‌చ్చి ఎన్నిక‌ను బ‌హిష్క‌రిచారు.దీంతో మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ బండారి అనూష ఎన్నిక‌ను వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో మెంబ‌ర్ గా ఉన్న పాయ‌ల్ శంక‌ర్ మున్సిపాలిటీ ప‌రిధిలో ఉన్న ప్ర‌భుత్వ అసైండ్ భూముల‌ను క‌బ్జా చేసి త‌న భార్య పేరుతో ,అల్లుని పేరు మీద కుటుంబ సభ్యుల పేరు మీద, బినామీల పేర్ల‌తో అక్ర‌మంగా రిజిష్ట్రేష‌న్ చేసుకున్నారని కౌన్సిల‌ర్లు ఆరోపించారు. బ‌ట్టి సావ‌ర్గం గ్రామ ప‌రిధిలోని ప్ర‌భుత్వ అసైండ్ భూమి స‌ర్వే నంబ‌ర్ 72\3 లో త‌న భార్య పేర 5 కోట్ల రూపాయ‌ల విలువ చేసే 15 ప్లాట్లు రిజిస్ట్రేష‌న్, ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ ప్ర‌తిపాదిత ప్రాంతాలైన భోర‌జ్ మండ‌లం హ‌త్తిఘాట్, గూడ రాంపూర్ ,గిమ్మ గ్రామాల ప‌రిధిలో దాదాపు 500 ఎకరాల భూములు ఈడీ కంట్రోల్లో ఉన్నా కూడా వాటిని అమ్మివేసి అక్రమాలకు పాల్పడ్డార‌ని ఆరోపించారు. 500 ఎక‌రాలు ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యులు బంధువులు బినామీల‌వే అన్నారు.వీటిపై ప్ర‌ముఖ ప‌త్రికల‌లో క‌థ‌నాలు కూడా వెలువ‌డ్డాయ‌న్నారు. రిమ్స్ వెనకాల 2/3 సర్వే నెంబర్ లో సుమారు 500 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి కబ్జా చేశారని అదేవిధంగా చిలుకూరి లక్ష్మీ గార్డెన్ , రత్న గార్డెన్ మధ్య సుమారు 9 ఎకరాల ఎఫ్టీఎల్ ల్యాండ్ కబ్జాలో అత‌ని ప్రేయం ఉంద‌న్నారు. వీట‌న్నిటిపైన పూర్తి విచారణ జరిపించిన తర్వాతనే కోఆప్షన్ ఎలక్షన్కు వెళ్లాలని సభ్యులందరూ చైర్పర్సన్ పోడియం వద్దకు వచ్చి గొడవ చేయడం వల్ల సభను మున్సిపల్ చైర్ పర్సన్ వాయిదా వేస్తున్న‌ట్టు తెలిపారు. తదుపరి కార్యాచరణ పై ప్రభుత్వం దృష్టికి పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు.

Latest