Mahaa Daily Exclusive

  మహిళల భద్రతకు భరోసా టీ -సేఫ్ అప్…

Share

  • మహిళల భద్రతకు భరోసా టీ -సేఫ్ అప్
  • ప్రజలకు అవగాహన కల్పించిన షీ-టీం ఎస్సై రామారావు

పోచమ్మ మైదానం, మహా ;

ప్రస్తుత కాలంలో జరుగుతున్న నేరాలు, మహిళల పై అఘాయిత్యాలు పెరుగుతున్న నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళల మీద జరిగే నేరాలను అదుపు చేయవచ్చని వరంగల్ షీ టీమ్ ఎస్సై రామారావు అన్నారు. వరంగల్ లోని దేశాయ్ పేట లేబర్ అడ్డా లో దాదాపు 70మంది రోజువారి శ్రామికుల కు సైబర్ నేరాలు, మహిళల పై జరిగే అత్యాచారాలు, మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల ఎస్సై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వరంగల్ షీ టీమ్ ఎస్సై రావెళ్ల రామారావు మాట్లాడుతూ అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని, సైబర్ నేరాల పై,అవగహన కలిగి వుండాలని మహిళలు ఒంటరిగా తెలియని ప్రదేశాలకు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు అందరు టీ-సేఫ్ ఆప్ ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, టీ-సేఫ్ ఆప్ పై అవగాహన కలిగి ఉండాలని, ఉద్యోగాలు చేసే మహిళలకు తాము పనిచేసే ప్రదేశాలలో అసభ్యకరంగా ప్రవర్తించే వారి పట్ల, ఆకతాయుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వారితో తమ వ్యక్తిగత విషయాలు పంచుకోరాదని సూచించారు. ఎవరైనా మహిళలపై అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్టైతే ధైర్యంగా వెంటనే షీ టీమ్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ1930 కి ఫిర్యాదు చేయాలని, మా షీ టీమ్ మొబైల్ నంబర్స్ సీపీ గారి వాట్సాప్ నంబర్ 8712685257, సీఐ వాట్సాప్ నెంబర్ 8712685142, ఎస్ఐ వాట్సాప్ నెంబర్ 8712685270కు ఫిర్యాదు చేసిన వారి వివరాలను చాలా గోప్యంగా ఉంచి నేరస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశాయ్ పేట లేబర్ అడ్డా పెద్ద మనిషి సమ్మయ్య తో పాటు మహిళా శ్రామికులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest