కారేపల్లి, మహ : కారేపల్లి మండల రేగులగూడెం గ్రామపంచాయతీలో రైతుల పంట చేనులో నిర్మించే పంట కుంట పనులను రేగులగూడెం సర్పంచ్ ఈసం మోతీరస్వామి సోమవారం ప్రారంభించారు. భూగర్బ జలాల పెంపు, పంట చేలను నీటిని వాడకం, చేపల పెంపకం కోసం వినియోగించటానికి ఈజీఎస్ ద్వారా నిర్మాణం చేయనున్నారు. ఎల్లబోయిన నాగేశ్వరరావు అనే రైతు చెందిన భూమిలో పంటకుంట(ఫారంపాడ్) మంజూరు కావటంతో పనులను ప్రారంభించారు. ఈసందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ 5 ఎకరాలు లోపు భూమి ఉన్న రైతులు పంట కుంట నిర్మాణం చేసుకోవటానికి అర్హులని తెలిపారు. వ్యవసాయాధికారికి దరఖాస్తు చేసుకోవటం ద్వారా మంజూరు అవుతుందన్నారు. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆవుల సత్యనారాయణ, పీల్డ్ అసిస్టెంట్ ఈసం భద్రం, గ్రామ పెద్దలు పిట్టల వెంకటేశ్వర్లు, అడప వెంకటేశ్వర్లు, పిట్టల చిన్న వెంకటేశ్వర్లు, మధు, పోలెబోయిన శ్రీను, తదితరులు పాల్గొన్నారు.








