- వైద్య సేవలతో పాటు సామాజిక కార్యక్రమాలతో చెరగని ముద్ర.. ఆర్టీసీ మెడికల్ ఆఫీసర్ డా. ఎ.వి. గిరిసింహారావుకు ఘన సన్మానం
కారేపల్లి, మహ : మూడు దశాబ్దాలకు పైగా ఆర్టీసీకి విశిష్ట వైద్య సేవలందించిన మెడికల్ ఆఫీసర్ డా. ఎ.వి. గిరిసింహారావు 33 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఖమ్మంలో సుదీర్ఘకాలం విధులు నిర్వహిస్తూ కార్మికులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, అధికారులు, వారి కుటుంబసభ్యులకు అందించిన వైద్య సేవలను గుర్తుచేసుకుంటూ పలువురు ఆయనను ఘనంగా సన్మానించారు.
33 ఏళ్ల ఉద్యోగ జీవితంలో వైద్య సేవలకే పరిమితం కాకుండా రక్తదాన శిబిరాలు, వైద్య అవగాహన కార్యక్రమాలు, వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి డా. గిరిసింహారావు ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యంగా 16 సార్లు మేడారం జాతర మెడికల్ క్యాంప్ ఇన్‌చార్జిగా, 30 సార్లు భద్రాచలం శ్రీరామనవమి ఉత్సవాల్లో, 20 సార్లు ముక్కోటి వేడుకల్లో వైద్య సేవలందించారు. రెండు గోదావరి పుష్కరాలు, కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు, వేములవాడ శివరాత్రి జాతరల్లోనూ విశేష వైద్య సేవలు అందించారు.
ఈ సేవల ద్వారా వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, భక్తులకు అండగా నిలిచిన ఆయన కార్మికుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. వీడ్కోలు కార్యక్రమంలో పలువురు దుశ్శాలువాలు, పూలమాలలు, సన్మాన పత్రాలతో ఆయనను ఘనంగా సత్కరించి, ఆయన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా డా. గిరిసింహారావు భావోద్వేగంగా మాట్లాడుతూ “కరీంనగర్ నా జన్మభూమి అయితే.. ఖమ్మం నా కర్మభూమి. ఇక్కడ నాకు అవకాశాలు కల్పించిన అధికారులు, నన్ను ఆదరించిన కార్మికులు, ఉద్యోగులకు జీవితాంతం రుణపడి ఉంటాను” అని కృతజ్ఞతలు తెలిపారు.
వైద్యుడిగా మాత్రమే కాకుండా కవి, రచయిత, సామాజిక వేత్తగా కూడా తనదైన ముద్ర వేసుకున్న డ








