Mahaa Daily Exclusive

  నేడు ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ..! మానసిక ప్రశాంతత,ఏకాగ్రత పెంచటానికి ధ్యానం..!

Share

కారేపల్లి, మహ : కారేపల్లి మండలంలోవి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు గురువారం నుండి ప్రత్యేక ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఎంఈఓ దుగ్గిరాల జయరాజు, కారేపల్లి పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షురాలు ముక్కా స్వరాజ్యలక్ష్మి తెలిపారు. బ్రహ్మశ్రీ పితామహ పత్రీజీ స్ఫూర్తితో కారేపల్లి పిరమిడ్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఉపాధ్యాయులు నిత్యం విద్యార్థుల బోధనతో పాటు అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో మానసిక ప్రశాంతత,ఏకాగ్రత,సానుకూల ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవడంలో ధ్యానం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఒత్తిడిని తగ్గించం,బోధనలో ఏకాగ్రత సాధించేందుకు ధ్యానం ఉపయోగపడుతుందన్నారు. ఉపాధ్యాయులు స్వయంగా ధ్యానం చేయడం నేర్చుకోవడంతో పాటు పాఠశాలల్లో విద్యార్థులకు ధ్యానాన్ని ఏ విధంగా పరిచయం చేయాలి,పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా ఎలా బోధించాలి,వారిలో ఏకాగ్రత,ప్రశాంతత,క్రమశిక్షణ,సానుకూల ఆలోచనలు పెంపొందించేలా ధ్యాన సాధనను ఎలా అలవాటు చేయాలి అనే అంశాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమానికి పిరమిడ్ సేవాదళ్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి,పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ బుద్ధ, భూపతిరాజు హనుమంతరావు,రమేష్ తదితరులు హాజరై ధ్యానం ప్రాధాన్యత,ఆచరణ విధానం,విద్యార్థులకు ధ్యానాన్ని బోధించే పద్ధతులపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.దీనిని కారేపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Latest