Mahaa Daily Exclusive

  కేపీహెచ్‌బీలో గజం రూ.2.70 లక్షలు..! హౌసింగ్‌ బోర్డు వేలంలో రికార్డు ధర..

Share

హైదరాబాద్‌, మహా.

హైదరాబాద్‌లో భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. కేపీహెచ్‌బీ ఏడో దశలో హౌసింగ్‌ బోర్డు నిర్వహించిన బహిరంగ వేలంలో చదరపు గజం గరిష్ఠంగా రూ.2.70 లక్షలకు అమ్ముడైంది.

ఏడో దశలోని 16 మధ్యతరగతి వర్గాల స్థలాలకు వేలం నిర్వహించగా, కనీస ధరను చదరపు గజానికి రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. భారీ డిమాండ్‌తో ఓ స్థలం రూ.2.70 లక్షలకు, మరో స్థలం రూ.2.36 లక్షలకు విక్రయమయ్యాయి. మరో రెండు స్థలాలు రూ.2.06 లక్షల చొప్పున అమ్ముడయ్యాయి.

వేలంలో 19 మంది పోటీ పడగా, స్థలాల సగటు ధర చదరపు గజానికి రూ.1.79 లక్షలు పలికింది. హౌసింగ్‌ బోర్డుకు సుమారు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరింది.

కేపీహెచ్‌బీలో మెరుగైన మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు, వాణిజ్య ప్రాంతాలకు సమీపం వంటి కారణాలతో భూములకు డిమాండ్‌ పెరుగుతోంది. తాజా వేలం ధరలు హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లో కేపీహెచ్‌బీకి ఉన్న భారీ డిమాండ్‌ను మరోసారి చాటిచెప్పాయి.

Latest