Mahaa Daily Exclusive

  పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పోరాటం చిరస్మరణీయం..:మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్..

Share

హనుమకొండ మహా ;

హన్మకొండలోని కాలేజీ కళాక్షేత్రంలో తెలంగాణ పూర్వ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (యాది) సంస్మరణ సభకు గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ హాజరై ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన నిర్వహించిన ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు, ఆందోళన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు ఉద్యమానికి మరింత ఊపునిచ్చాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక ఉద్యమ కార్యక్రమాల్లో ముందుండి పోరాడారని, ఉద్యమకారులను సమీకరించి ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల చైతన్యం కల్పించారని నన్నపునేని నరేందర్ గుర్తు చేసుకున్నారు.
ఉద్యమ సమయంలో ఎదురైన ఎన్నో ఇబ్బందులను, ఒత్తిళ్లను లెక్కచేయకుండా తెలంగాణ కోసం నిరంతరం పోరాటం చేసిన ఆయన సేవలు మరువలేనివని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన త్యాగాలు, పోరాటాలు, ప్రజా ఉద్యమానికి అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం పనిచేయడం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నన్నపునేని నరేందర్ గారు అన్నారు.
దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలు నెరవేరాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నన్నపునేని నరేందర్ ఆకాంక్షించారు.

Latest