Mahaa Daily Exclusive

  కుడా చైర్ పర్సన్ గా గుండు సుధారాణి..! నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి, సుధారాణి కృతజ్ఞతలు..

Share

  • నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి, సుధారాణి కృతజ్ఞతలు
  • బీసీ మహిళలకు అత్యున్నత పదవులు కల్పించడం చారిత్రాత్మకం

వరంగల్, బ్యూరో మహా;

కుడా చైర్ పర్సన్ గా గుండు సుధారాణి గురువారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా
తనను కుడా చైర్‌ పర్సన్‌ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీసీల పక్షపాతిగా, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బీసీ మహిళలకు అత్యంత కీలకమైన, ప్రధానమైన పదవులు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆమె పేర్కొన్నారు.
బీసీ మహిళలకు ఇంతటి ప్రాధాన్యత కలిగిన పదవులు అందించడం కేవలం పదవుల కల్పన మాత్రమే కాదని, బీసీ వర్గాల పై ముఖ్యమంత్రికి ఉన్న నమ్మకానికి, మహిళల సామర్థ్యంపై ఆయనకున్న విశ్వాసానికి నిదర్శనమని అన్నారు.
తనపై నమ్మకం ఉంచి చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా, బీసీల అభ్యున్నతికి మహిళా సాధికారతకు చిత్తశుద్ధితో పనిచేస్తానని గుండు సుధారాణి తెలిపారు.
నా నియామకానికి సహకరించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , కాంగ్రేస్ అధినాయకులు సోనియాగాంధీ, లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంకగాంధి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క , రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ కూడా చైర్మన్ హనుమకొండ జిల్లా డిసిసి అధ్యక్షులు వెంకట్రాంరెడ్డి, వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నేతలు, నాయకులకు, కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా గుండు సుధారాణి ధన్యవాదాలు తెలియజేశారు.

Latest