- ఇదేక్కడి న్యాయం.?
- పాత టీడీపీ నేతలకే నామినేటెడ్ పదవులా?
- కుడా చైర్‌పర్సన్ గా సుధారాణి నియామకం పై కాంగ్రెస్ లో అసంతృప్తి
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేరిన నాయకురాలికి పదవి ఎలా?
- ఏళ్లుగా కష్టపడిన అచ్చా కాంగ్రెస్ నేతలకు, మహిళా నేతలకు దక్కని పదవులు
- రాష్ట్ర కాంగ్రెస్ లో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు
వరంగల్,బ్యూరో మహా ;
నిన్నటికి నిన్న మహిళా మంత్రి కొండా సురేఖ ను బర్తరఫ్ చేశారనే అంశం రాష్ట్ర కాంగ్రెస్ సర్కారును ఓ కుదుపు కుదిపేస్తుంది. ఎందుకు ప్రత్యామ్నాయంగా బీసీలకు న్యాయం చేయాలని ఉద్దేశంతో రేవంత్ సర్కార్ పద్మశాలి వర్గానికి చెందిన మాజీ మేయర్ గుండు సుధారాణి కి కుడా చైర్ పర్సన్ గా నియమించింది.
ఇక్కడే అసలు కథ మొదలైంది. కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి, పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషిచేసిన అచ్చా కాంగ్రెస్ సీనియర్ నేతలకు, మహిళా నేతలకు అన్యాయం జరిగిందని ఇదెక్కడి న్యాయమని రాష్ట్ర కాంగ్రెస్ లో ఓ కలవరం మొదలైంది. కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నవి అమ్ముకొని పార్టీ కోసం నిలబడ్డ నేతలకు కనీసం నామినేటెడ్ పదవులు రాకుండా పోయాయని కొంతమంది సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. గురువారం
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్ గా గుండు సుధారాణి నియామకం కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగిలిస్తున్నాయని ఇతర పార్టీ నుంచి గెలిచి పదవులు అనుభవించి మధ్యలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో చేరిన మహిళా నేతకు కీలకమైన నామినేటెడ్ పదవి కట్టబెట్టడం పై పలువురు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సుధారాణి నియామకం వెనుక సామాజిక సమీకరణాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ.. పార్టీ కోసం కష్టపడిన తమకు మాత్రం ఎందుకు గుర్తింపు దక్కడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారనే చర్చ కొంతకాలంగా పార్టీ వర్గాల్లో జరుగుతోంది. నియోజకవర్గాలు, జిల్లాల స్థాయిలో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ కాంగ్రెస్ కు అండగా నిలిచిన నాయకుల్లో చాలామందికి ఇప్పటికీ సరైన గుర్తింపు లభించలేదన్న వాదనలు లేకపోలేదు. నామినేటెడ్ పదవుల కోసం గత కొంతకాలంగా ఎదురుచూసిన ఆశావాహులు నామినేటెడ్ పదవుల భర్తీ సందర్భంగా తమను పరిగణనలోకి తీసుకుంటారని ఆశించిన వారికి నిరాశే ఎదురైందని తాజాగా కుడా చైర్‌పర్సన్ పదవిని సుధారాణికి కేటాయించడంతో ఈ అసంతృప్తి మరింత బహిర్గత మవుతున్నట్లు సమాచారం.
*పచ్చా కాంగ్రెస్ నేతలకే పదవులా?*
దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన పలువురు నేతలకు ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు పార్టీలో బహిరంగంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలు అచ్చా కాంగ్రెస్ పచ్చా కాంగ్రెస్ అని అంటున్నట్లుగా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కు తున్నాయంటూ కాంగ్రెస్ లోని పాత నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం సంవత్సరాల తరబడి పనిచేసిన తమను పక్కనబెట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా సుధారాణి నియామకం కూడా ఇదే కోణంలో పార్టీలో చర్చ జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.








