Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం: మాజీ మంత్రి హరీష్‌రావు

Share

 

హైదరాబాద్ : కరువు పరిస్థితుల్లో ప్రజలను, రైతులను ఆదుకోవాల్సింది పోయి గ్లోబల్ సమ్మిట్ పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దుబారా ఖర్చు చేస్తున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ పాలన తెలంగాణను పదేళ్లు వెనక్కి నెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెసోళ్లు గోబెల్స్ మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరమని అన్నారు. భూములు అమ్ముకుంటూ పోతే బొందలగడ్డకు కూడా భూములు మిగలవని మాట్లాడిన రేవంత్ రెడ్డి నేడు హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ, హెచ్ఎండీఏ, టీజీఐఐసీ భూములను అమ్ముతూ భూముల అమ్మకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడని ఫైర్ అయ్యారు.