హైదరాబాద్, మహా: తెలంగాణ, బాంబే హైకోర్టుల చీఫ్ జస్టిస్ లను బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు కొలిజీయం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ ను ఢిల్లీకి హైకోర్టుకు బదిలీ చేయాలని, అదేవిధంగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు బదిలీ చేయాలని ఆ సిఫారసులో పేర్కొంది. అలాగే, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలంటూ కొలీజియం సిఫారసు చేసింది. కాగా, 2023 జులైలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే నియమితులయ్యారు.
Post Views: 44








