ప్రజల గొంతుకగా ఎఎన్ఎన్ ఛానల్ వేగంగా దూసుకెళ్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ఎఎన్ఎన్- 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ములుగు జిల్లా కేంద్రంలో ఆవిష్కరించిన ఆమె ఈ సందర్భంగా ఛానల్ యాజమాన్యానికి, వరంగల్ జిల్లా టీమ్ కు అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎఎన్ఎన్ అద్భుత ప్రసారాలతో ప్రజల పక్షపాతిగా మారిందన్నారు. ఛానల్ యాజమాన్యం కంది శ్రీనివాసరెడ్డికి అభినందనలు తెలిపారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ఎఎన్ఎన్ వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జి.చంద్రశేఖర్, రిపోర్టర్లు పాల్గొన్నారు.
Post Views: 33








