Mahaa Daily Exclusive

  హైకోర్టు తీర్పుపై సుప్రీంకు కేటీఆర్ ఏసీబీ కేసు కొట్టి వేయాలని పిటిషన్….!

Share

ఫార్ములా ఈ కార్ రేసు పై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గతంలోనే హైకోర్టులో కేటీఆర్ స్క్వాష్ పిటిషన్ వేయగా మంగళవారం కొట్టి వేసింది. దీంతో సుప్రీంమెట్లెక్కారు కేటీఆర్. ఈ పార్ములా కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఏసీబీ కేసు నమోదు చేసినట్లు గత కొంత కాలంగా కేటీఆర్ పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ కేటీఆర్ హైకోర్చులో స్క్వాష్ పిటిషన్ వేయగా విచారించిన హైకోర్టు పిటిషన్ ను కొట్టి వేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వెంటనే సుప్రీంను ఆశ్రయించారు. ఒక వైపు ఏసీబీ, మరో వైపు ఈడీ కేసు నమోదు చేసుకుని విచారణకు రావాలని నోటీసులు పంపించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది.