పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వాటికన్ అధికారులు తెలిపారు. కొత్తగా శ్వాససంబంధిత సమస్యలు ఏవీ లేవని వెల్లడించారు. డబుల్ నిమోనియాకు గురైన ఫ్రాన్సిస్ ఫిబ్రవరి 14 నుంచి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. మూడు వారాలుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం పోప్ ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వాటికన్ అధికారులు వెల్లడించారు. మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు.
Post Views: 68








