Mahaa Daily Exclusive

  ప్ర‌జా సేవాభ‌వ‌న్ లో రాష్ట్రావ‌త‌ర‌ణ దినోత్సవ‌ వేడుక‌లు జాతీయ ప‌తాకావిష్క‌రించిన కంది శ్రీ‌నివాస రెడ్డి ..!

Share

ఆదిలాబాద్, మహా :
అనేక ఆశ‌యాలు, ఆకాంక్ష‌ల‌తో సాధించుకున్న తెలంగాణ గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో చాలా వెనుక‌బ‌డింద‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. తెలంగాణా రాష్ట్రావ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా సోమవారం ప‌ట్ట‌ణంలోని త‌న క్యాంపు కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున హాజ‌రైన కాంగ్రెస్ శ్రేణులు ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. స్వ‌రాష్ట్రంలో కొత్త‌గా ఏర్ప‌డిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌క‌నుగుణంగా ప‌ని చేస్తూ వారి విశ్వాసాన్ని పొందింద‌న్నారు. పేద బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం కోసం ప్ర‌భుత్వం ఎన్నోమంచి ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టింద‌న్నారు.ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సార‌ధ్యంలో తెలంగాణ మ‌రింత అభివృద్ధి చెందాల‌ని ఆకాంక్షిస్తూ ప్ర‌జ‌ల‌కు తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో డీసీసీబీ చైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మ‌న్ దిగంబ‌ర్ రావు పాటిల్,నాయ‌కులు మాజీ మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ జ‌హీర్ రంజానీ ,నాగ‌ర్ క‌ర్ శంక‌ర్ , ముజాహిదీన్ , లోక ప్ర‌వీణ్ రెడ్డి, సుధాక‌ర్ గౌడ్ ,బండి దేవిదాస్ చారి, బండారి స‌తీష్, జాఫ‌ర్ అహ్మ‌ద్, రామ్ కుమార్,ఎంఏ ష‌కీల్, ర‌ఫీక్,ఆశ‌న్న‌, మంచాల మ‌ల్ల‌య్య‌,దీప‌క్ రావు,కందుల సుఖేంద‌ర్ ,ర‌మేష్ ,ప్ర‌భాక‌ర్, అబ్దుల్లా, అంజాద్, అయాష్, ఫ‌జిల్, దేశెట్టి ప్ర‌భావ‌తి,ల‌తా, సోనియా, శ్రీ‌లేఖ‌, అఫ్రోజ‌,ష‌బానా,మందాకిని త‌దిత‌రులు పాల్గొన్నారు.