ఆదిలాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవాభవన్ ను సందర్శించారు. సోమవారం తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పుస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం కంది శ్రీనివాస రెడ్డి ఆహ్వానం మేరకు ప్రజాసేవాభవన్ కు విచ్చేశారు. ఆయనకు పార్టీ శ్రేణులతో కలిసి కంది శ్రీనివాస రెడ్డి ఘన స్వాగతం పలికారు, శాలువాలతో సత్కరించారు.
Post Views: 42








