వరంగల్ మహా;
బూత్ లెవెల్ అధికారులు బాధ్యత గా విధులు నిర్వహించాలని బల్దియా కమిషనర్/106- వరంగల్ (తూర్పు) నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి చాహత్ బాజ్ పాయ్ అన్నారు.
106 -వరంగల్ (తూర్పు) నియోజకవర్గ పరిధిలోని బూత్ స్థాయి ఆఫీసర్ల కు వరంగల్ ఐ ఎం ఏ హాల్ లో గురువారం ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ అవగాహన కార్యక్రమంలో ఆర్ ఓ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా బూత్ లెవెల్ అధికారులకు ప్రతి రోజు 50 మంది చొప్పున ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని కార్యక్రమంలో భాగంగా ఓటర్ లిస్ట్ లో ఎలాంటి పొరపాట్లు తప్పులు లేకుండా పకడ్బందీగా తయారు చేయడానికి బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఆ ఇంట్లో 18 సం.లు నిండిన యువతి యువకులతో పాటు చనిపోయిన వారు ఎవరైనా ఉంటే వారి వివరాలను నమోదు చేయాలని తప్పులు లేని ఓటరు జాబితా తయారీ లక్ష్యంగా బూత్ లెవెల్ అధికారులు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ఓటు నమోదు, తొలగింపు అనునది బి ఎల్ ఓ లు విచారణ తర్వాతే చేపట్టాలని తద్వారా ఎలాంటి తప్పు జరగడానికి ఆస్కారం ఉండదని ఈ సందర్భంగా కమిషనర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్, ఎన్నికల డి టి సుబాన్, మాస్టర్ ట్రేని సందీప్ తో పాటు శిక్షకులు కనకయ్య నాగరాజు తదితరులు పాల్గొన్నారు.








