Mahaa Daily Exclusive

  ఎంఎంటీఎస్ కు ఏమైంది..? ప్రయాణికుల సంఖ్య తగ్గుతుండటంపై సీఎం రేవంత్ ఆరా..

Share

  • ఎంఎంటీఎస్ కు ఏమైంది?
  • ప్రయాణికుల సంఖ్య తగ్గుతుండటంపై సీఎం రేవంత్ ఆరా
  • ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా సేవ‌లు మారాలని సూచన
  • స్వీయ ఆదాయ వ‌న‌రులు పెంచుకోవాలని సలహా

 

హైద‌రాబాద్‌, మహా : హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాలో ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్‌లో ఏటికేడు ప్ర‌యాణికుల త‌గ్గుముఖం పట్టడంపై ముఖ్య‌మంత్రి ఆరా తీశారు. ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌పై శాన‌స‌మండ‌లి హాల్‌లో ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. కార్యాల‌యాల స‌మ‌యాల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచ‌డంతో పాటు స‌మ‌యపాల‌న పాటిస్తూ స‌ర్వీసులు న‌డ‌పాల‌ని సీఎం ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేష‌న్ల వ‌ద్ద‌కు ఆర్టీసీ బ‌స్సులు వెళ్లేందుకు అవ‌కాశం లేక‌పోవ‌డం, స్టేష‌న్లు లోప‌లికి ఉన్నందున అక్క‌డ‌కు రాక‌పోక‌లు సాగించేందుకు వీలుగా మినీ బ‌స్సులు న‌డిపే అంశాన్ని ప‌రిశీలించాల‌ని సీఎం ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికులకు అవ‌స‌ర‌మైన అన్ని వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌ని సీఎం ఆదేశించారు. మెరుగైన వ‌స‌తులు ఉన్న‌ప్పుడే ప్ర‌యాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతార‌ని సీఎం తెలిపారు. స్వీయ ఆదాయ వ‌న‌రులు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని అధికారుల‌కు సీఎం సూచించారు. లాస్ట్ మైల్ క‌నెక్టివిటీ పెంపుతో పాటు ప్ర‌యాణికుల సంఖ్య పెంపు, వ‌స‌తులు మెరుగుకు ఉన్న అవ‌కాశాల‌పై అధ్య‌య‌నం చేసి నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. స‌మీక్ష‌లో ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణారావు, ఎంఏయూడీ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ జయేష్‌ రంజ‌న్‌, ఆర్ అండ్ బీ వికాస్ రాజ్‌, సీఎం స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ అజిత్ రెడ్డి, సీఎం కార్య‌ద‌ర్శి మాణిక్‌రాజ్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఆర్‌.వి.కర్ణ‌న్‌, హెచ్‌యూఎంటీఏ ఎండీ జీవ‌న్ బాబు, ద‌క్షిణ మ‌ధ్య రైల్వే డీసీఎం చ‌ర‌ణ్ నాయ‌క్ పాల్గొన్నారు.

Latest