- తొర్రూరులో ఘనంగా సీతారాముల కళ్యాణం
- ముఖ్యఅతిథిగా హాజరైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే రంగారెడ్డి
సీతారాముల కళ్యాణం కి పట్టి వస్త్రాలు సమర్పించారు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
శ్రీరామనవని పురస్కరించుకొని, తొర్రూరు సీతారాముల కళ్యాణ మహోత్సవంలో, ఎమ్మెల్యే రంగారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోకి ఆదిభట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్లోని రంగనాయకుల ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కుటుంబ సమేతంగా హాజరై, ప్రసిద్ధ రంగనాయక స్వామి ఆలయంలో ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవాన్ని కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి కుటుంబ సమేతంగా హాజరై, సీతారాముల కల్యాణ మహోత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ…. సీతారాముల కళ్యాణాన్ని దర్శించడం ద్వారా జన్మ సార్థకమవుతుందని, శ్రీరామచంద్రుడి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మల్రెడ్డి యాదిరెడ్డి, ఆలయ చైర్మన్ అనిల్ రెడ్డి తదితరులు కుటుంబ సమేతంగా కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.








