Mahaa Daily Exclusive

  హెచ్.టీ విత్తనాలు మానవ ఆరోగ్యానికి హానికరం…..

Share

  • హెచ్.టీ విత్తనాలు మానవ ఆరోగ్యానికి హానికరం
  • వేసవి దుక్కులు రైతుకు మేలు

 

కారేపల్లి, మహా: హెచ్.టీ పత్తి విత్తనాలు మానవ ఆరోగ్యానికి హానికరమని సింగరేణి మండల వ్యవసాధికారి బట్టు అశోక్ కుమార్ తెలిపారు. గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాల ఎంపిక, సాగుకు రైతును సంసిద్ధత చేయడంపై సింగరేణి మండలంలోని రేలకాయలపల్లి, గుంపెళ్లగూడెం,ఉసిరికాయలపల్లి, రావోజీతండా, చర్లపల్లి గ్రామాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ వరి, మొక్కజొన్న, ప్రత్తి పంట అనంతరం అవశేషాలను కాల్చకూడదన్నారు.అవశేషాలు కాల్చడం ద్వారా భూమిలో ఉన్న ఆరోగ్యకరమైన సూక్ష్మజీవులు, పోషకాలు నశించి భూమి ఆరోగ్యం దెబ్బతిని పంట దిగుబడులు తగ్గుతాయన్నారు. . పంట అవశేషాలను రోటోవేటర్ ద్వారా భూమిలో కలియదున్నడం ద్వారా భూమిలో సేంద్రీయ కర్బనం పెరిగి పంటకు కావలసిన అన్ని పోషకాలు అందుతాయని వారు తెలియజేశారు. రైతులు వేసవిలో లోతుగా వేసవి దుక్కులు దున్నుకోవాలని, దీని ద్వారా చీడ పీడలు తగ్గుతాయన్నారు. భూమిలో సరిపడ తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు విత్తుకోవాలని, సరిపడ తేమ లేనప్పుడు విత్తుకుంటే మొలక శాతం తగ్గి రైతుకు నష్టం కల్గిస్తాయన్నారు. లైసెన్స్ పొందిన విత్తన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చెయ్యాలని, ఊర్లలో తిరిగి విత్తనాలు అమ్మేవారి వద్ద విత్తనాలు తీసుకోకూడదని తెలియజేశారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు విధిగా బిల్లును తీసుకోవాలని తెలియజేశారు. రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అందే ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఏఈవో ల వద్ద విధిగా రైతు రిజిస్ట్రేషన్ చేయించాలని, యూరియా కోసం ఫోన్ నెంబర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో లు నరేష్, మహేష్, ప్రమీల, మున్నీ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.