కారేపల్లి, మహా : కారేపల్లి లో సుమన్ ఐ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంమైంది. ఈ శిబిరాన్ని సింగరేణి సర్పంచ్ మేదరి వీర ప్రతాప్(టోని) ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కారేపల్లి పరిసర ప్రాంత ప్రజలు ఈ శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ వైద్య శిబిరంలో ఉచిత కంటి పరీక్షలు చేసి, మందులు ఉచితంగా అందజేశారు. కళ్ళజోడు అవసరమైన వాడికి తక్కువ ధరకే అందించారు. ఈ కార్యక్రమంలో సుమన్ ఐ కేర్ వైద్యులు డాక్టర్ అశోక్, రాజేష్, వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి, వార్డు మెంబర్లు మేకల కుమార్, రావుల రాజశేఖర్, అంజయ్య, సర్దార్, మహమ్మద్ యాకుబ్ అలీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 82








