Mahaa Daily Exclusive

  కేటీఆర్‌ నాకు సోదరుడితో సమానం పవన్‌ కల్యాణ్…

Share

 

హైదరాబాద్, మహా

హైదరాబాద్​లో తన సభకు అనుమతి ఇవ్వడం చిన్న విషయమని, ఇస్తే గొడవే వచ్చేది కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్‌లో తనకు ఇల్లు ఉందని, అక్కడ ఉండటం సాధారణ విషయమేనన్నారు. సభ పెట్టుకోవడం అనేది తన హక్కు.. దాన్ని కాదనకూడదన్నారు. రాష్ట్ర విభజనకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ప్రాంతీయ విద్వేషాలు రగల్చడం రాహుల్‌గాంధీకి మంచిది కాదని పవన్‌ సూచించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వారు ప్రజలకు ఏం సందేశం ఇస్తారని పవన్‌ ప్రశ్నించారు. తెలంగాణ, తమిళనాడులో ప్రాంతీయ భావం ఉందని, ఏపీ ప్రజల్లో ఉన్న ఉప ప్రాంతీయవాదం సరికాదన్నారు. కేటీఆర్‌ తనకు సోదరుడితో సమానమని, ఆయన ఏమన్నారో తాను వినలేదన్నారు. తామిద్దరం కలిసినప్పుడు ఈ అంశంపై సరదాగా మాట్లాడుకుంటామని పవన్‌కల్యాణ్ తెలిపారు.