మహా వరంగల్ బ్యూరో:
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
రహదారి పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించి, గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా
ప్రమాదం జరిగిన కొంత సమయం గడిచినా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోలేదని స్థానికులు వాపోతున్నారు. దీంతో ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Post Views: 7








