సమస్యలపై సమరం — ప్రజల పక్షాన ఎప్పుడూ MGR
బంజారాహిల్స్ డివిజన్ NB నగర్ బస్తీలో నెలకొన్న ప్రజా సమస్యలపై ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు ఈరోజు ఉదయం స్థానికులు దేశెట్టి రమేష్ మరియు అయూబ్ పిలుపుమేరకు పాదయాత్ర నిర్వహించారు.
స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న MGR గారు, గత నాలుగు నెలలుగా రోడ్డు మంజూరైనా అధికారులు మరియు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మై ఫీల్ మరియు పోలీస్ పెంట్టయ్య లైన్లలో డ్రైనేజీ పనులు పూర్తి చేసిన రోడ్లు అలాగే వదిలేసిన పరిస్థితిని తీవ్రంగా ఖండించారు.
వెంటనే GHMC అధికారులతో మాట్లాడి, ప్రజలు ఇబ్బందులు పడకుండా త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అలాగే బస్తీలో నెలకొన్న నీటి సమస్యపై స్పందించి, వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ గారు మరియు లైన్మెన్ షకీల్ తో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రావుల విజయ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, అన్వర్, ఓర్సు పెంటయ్య, నవీన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.








