Mahaa Daily Exclusive

  అడుప మహేశ్ హత్యను తీవ్రంగా ఖండించిన డిసిసి అధ్యక్షుడు అయూబ్..

Share

*అడుప మహేశ్ హత్యను తీవ్రంగా ఖండించిన డిసిసి అధ్యక్షుడు అయూబ్

*మహేశ్ అంత్యక్రియల్లో పాడెమోసిన అయూబ్

వరంగల్, బ్యూరో మహా;

వరంగల్ 14వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సోషల్ మీడియా ఇంచార్జ్ అడుప మహేశ్ హత్యను వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ తీవ్రంగా ఖండించారు. మహేశ్ నివాసంలో ఆయన భౌతిక గాయానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన అయూబ్ నగరంలో పేట్రేగిపోతున్న రౌడీ మూకల ఆగడాలు, కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్న రౌడీలు, రాజకీయ అండదండలతో రౌడీషీటర్లు సెటిల్మెంట్లు చేస్తూ నగరంలో విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ హత్యా యత్నాలకు కూడా పాల్పడు తున్నారని మండిపడ్డారు. వీరు ముఠాలుగా ఏర్పడి వారి ఉనికిని చాటుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే కొంతమంది రౌడీ రాజకీయ నాయకులు వీరికి పరోక్షంగా సహకారాన్ని అందిస్తున్నట్లు తెలుస్తుందని అన్నారు. రాజకీయ నాయకులు ఏ పార్టీ వారైనా దయచేసి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించ కూడదని ముఖ్యంగా పోలీసులు రౌడీల పై ప్రత్యేక దృష్టి సారించి సామాన్య ప్రజలను కాపాడవలసిన బాధ్యత పోలీసుల పై ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రౌడీల పై ఉక్కు పాదం మోపడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వరంగల్ లో జరిగిన ఈ దారుణమైన ఘటన పై వారు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి ఆపద ఉన్న బెదిరింపులు దాడులు జరిగే పరిస్థితి ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటానని తెలిపారు. అంతేకాకుండా అడుప మహేష్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని వారి కుటుంబానికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ తీవ్ర భావోద్వేగంతో స్పందించారు.