Mahaa Daily Exclusive

  కోటమైసమ్మ జాతర దుకాణాల వేలం …. రూ.2.20లక్షలు పెరిగిన వేలం ఆదాయం…..

Share

 

కారేపల్లి, మహా: దసరా సందర్భంగా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోట మైసమ్మతల్లి ఆలయం ప్రాంగణంలో జరిగే జాతరలో దుకాణాల ఏర్పాటుకు దేవాదాయశాఖ అధికారులు శుక్రవారం వేలం పాటలు నిర్వహించారు. జాతర సందర్భంగా 11 రోజుల పాటు కొబ్బరికాయలు, పూజా సామాగ్రీ అమ్మకాలకు, లడ్డు, పులిహోరా దుకాణానికి, పుట్నాలు, పేలాలు అమ్ముకోవటానికి, కొబ్బరి చిప్పలు ప్రోగుచేసుకునే హక్కు, మిఠాయి దుకాణం, ఐస్ క్రీమ్ లు అమ్ముకాలకు వంటి 6 అంశాలపై వేలం పాటను దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ సమత ఆధ్వర్యంలో నిర్వహించారు. కొబ్బరికాయలు, పూజ సామాగ్రీకి రూ. 5.01లక్షలు, లడ్డు పులిహోర కు రూ. 1.75 లక్షలు, కొబ్బరి చిప్పల పోగు చేసుకోవటానికి రూ. 1.83 లక్షలు, ఐస్ క్రీమ్ అమ్మకాలకు రూ. 0.43 లక్షలకు పాడుకున్నారు. రెండు అంశాలైన పుట్నాలు-పేలాలు, మిఠాయి అమ్మకాలకు వేలం పాటలు జరగలేదని ఆలయ ఈవో కటుకూరి వెంకటయ్య, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ పర్సా పట్టాభి రామారావు లు తెలిపారు. పాటలు నిర్వహించిన 4 అంశాలుకు సంబంధించి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది. 2.20 లక్షలు అధిక ఆదాయం వచ్చిందన్నారు. ఈ వేలంపాటలలో ఉసిరికాయలపల్లి సర్పంచ్ వరలక్ష్మి, ఆలయ ప్రధాన అర్చకులు కొత్తలంక కైలాస శర్మ, ఉద్యోగులు పర్స సాయి, గణితి నారాయణ,మూడ్ మోహన్ చౌహన్ పాల్గొన్నారు.