Mahaa Daily Exclusive

  తెలంగాణ బీజేపీలో కీలక నియామకాలు..

Share

తెలంగాణ బీజేపీలో కీలక నియామకాలు.
* మూడు జిల్లాలకు నూతన అధ్యక్షుల ప్రకటన.
హైదరాబాద్, మహా.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర శాఖ సంస్థాగత మార్పుల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మూడు జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్ లో ఉన్న రాష్ట్ర కార్యాలయం నుంచి బుధవారం ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ తాజా నియామకాల ప్రకారం, వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా యు. రమేష్ ఎంపికయ్యారు. మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను డి. గిరివర్ధన్ రెడ్డికి అప్పగించారు. అలాగే, కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షుడిగా సాయి మల్లేశంను నియమిస్తున్నట్లు రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది.