- కలెక్టరేట్ లో ఘనంగా కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు
- నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్, బ్యూరో మహా;
తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిగా ఆయనను కొనియాడారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి అదనపు కలెక్టర్ లోకల్ బాడీ వైవి గణేష్, డిఆర్ఓ విజయలక్ష్మి మరియు కలెక్టరేట్ అధికారుకు సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కు ఘనంగా నివాళులర్పించారు.
Post Views: 5








