Mahaa Daily Exclusive

  జెన్-జీ దేశ వ్యతిరేకులు కాదు…

Share

జెన్-జీ దేశ వ్యతిరేకులు కాదు.
• నిరసనలు ప్రజాస్వామ్య హక్కే.
• కానీ నియమాలు పాటించాలి
* ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

ముంబై, మహా .

జెన్-జీ యువతను దేశ వ్యతిరేకులుగా చూడడం సరికాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు సమర్థనీయమైనవేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు సంభాషణకు, సమస్యల పరిష్కారానికి దోహదపడే మార్గమని స్పష్టం చేశారు.

ముంబైలో నిర్వహించిన ఐఐఎమ్‌యూఎన్ కార్యక్రమంలో జెన్-జీ, జెన్-ఆల్ఫా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన భాగవత్.. తమ కాలంలో పెద్దల మాటకు ప్రాధాన్యం ఇచ్చేవారని, కానీ నేటి తరం ప్రతి విషయానికీ తార్కిక వివరణ కోరుతోందన్నారు. ప్రశ్నించడం, అభిప్రాయాలు వ్యక్తం చేయడం, నిరసనలు తెలపడం ప్రజాస్వామ్య హక్కేనని పేర్కొన్నారు. అయితే నిరసనలు కూడా రాజ్యాంగబద్ధమైన పద్ధతులు, నియమాలను అనుసరించి జరగాలని సూచించారు.

యువత ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుంటూ వారితో నిరంతర సంభాషణ కొనసాగించడం సమాజానికి అవసరమని భాగవత్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వందకు పైగా నగరాల నుంచి రెండు వేల మందికి పైగా విద్యార్థులు హాజరుకాగా, వారితో ఆయన ముఖాముఖి నిర్వహించి పలు అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.