మంథని నుంచి మంచిర్యాలను కలుపుతూ గోదావరి నదిపై రూ.140 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేసుకున్నామని, అదే విధంగా మంథనికి రింగ్ రొడ్డు నిర్మాణం వల్ల పట్టణ విస్తరణ పెరుగుతుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం నాడు మంథనిలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. పట్టణ విస్తరణ జరిగితూ దేశ, విదేశాలలో స్థిర పడిన ప్రజలు సొంత గ్రామాల్లో ఇండ్లు నిర్మించుకునేందుకు, ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుందని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రోడ్ల అభివృద్ధి ద్వారా వాణిజ్య సదుపాయాలు మెరుగవుతాయని మంత్రి పేర్కొన్నారు. మంత్రి పర్యటనలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ, స్థానిక నేతలు పాల్గొన్నారు
Post Views: 36








