Mahaa Daily Exclusive

  బాంబులు పేలడం స్టార్ట్.. KTR అరెస్ట్‌పై పొంగులేటి సంచలనం..!

Share

తెలంగాణ రాజకీయాల్లో బాంబులు పేలడం మొదలైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై స్పందించారు. తప్పుచేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని, తప్పు ఎప్పటికైనా బయటపడుతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్ స్వ్కాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టిన వేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ తప్పు ఒప్పులు తేల్చేది కోర్టులేనని, వ్యవస్థల ముందు బలప్రదర్శన చేయడం కరెక్ట్ కాదంటూ విమర్శలు గుప్పించారు. ‘మాకు బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ కాదు. మేము ఎవరినీ టార్గెట్ చేయడం లేదు. కేటీఆర్ తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారు ? కేటీఆర్ మారలేదు, ఆయన రైటర్ మారినట్లుంది. కొత్త సంవత్సరంలో కేటీఆర్ లో స్పిరిట్ పెరిగింది. పార్టీకి బాండ్స్ ఎందుకు ఇచ్చారో.. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చెప్పాలి. బాండ్స్ మాత్రమే కాదు ఇంకా బయట పడాల్సినవి చాలా ఉన్నాయి. విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాకు వెళ్ళాయో తేలాలి, ప్రాంతీయ పార్టీల్లో రిచేస్ట్ పార్టీ బీఆర్ఎస్, అంత డబ్బు ఎలా వచ్చింది? కేసీఆర్ ఏ కేసులో ఉన్నా హరీష్ అక్కడ ఉంటారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాలని కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే ఆలోచన లేదంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.

ఉద్దేశపూరితంగా చేసింది

ఇప్పటి వరకు వేసిన కేసులు, విచారణ కమిషన్ లు బీఆర్ఎస్ వాళ్లు అడిగితేనే వేశామన్నారు. కాళేశ్వరం, విద్యుత్, ఈ ఫార్ములాపై విచారణ వారే అడిగారు, కక్షపూరితంగా, ఉద్దేశపూరితంగా చేసింది ఏమీలేదన్నారు. సిస్టంలో వాళ్ళు తప్పులు చేశారు కాబట్టే అన్ని బయటపడుతున్నాయన్నారు. జైలుకు వెళ్తేనే సిఎం అవుతాను అనుకుంటే కేటీఆర్ కంటే ముందు కవిత ఉన్నారు. ఇవేవీ లాభనష్టాల కోసం జరుగుతున్నవి కాదు. అరవింద్ కుమార్ నిజాలు చెప్తే అన్నీ బయటకు వస్తాయి. జాతీయ పార్టీలకు లేని నిధులు ప్రాంతీయ పార్టీకి ఎలా వచ్చాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దేశం గురించి తప్ప తెలంగాణ గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు.

ధరణిపై మాట్లాడుతూ,సంక్రాంతి తర్వాత రికార్డులు ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వబోతున్నామని తెలిపారు. భూదాన్, దేవాదాయ, అసైండ్ భూముల్లో జరిగిన కుంభకోణాలు అన్నీ ఫోరెన్సిక్ ఆడిట్ లో బయట పడతాయన్నారు. సిరిసిల్లలో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయింది. రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన భూ బాగోతం ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత బయట పడుతుందని పేర్కొన్నారు. భూభారతి బిల్లు గవర్నర్ వద్ద ఉంది. గవర్నర్ నుంచి అనుమతి రాగానే గెజిట్ విడుదల అవుతుందని తెలిపారు. రూల్స్ ప్రేమ్ చేయడానికి రెండు నెలల టైం పడుతుందని థెలిపారు. విద్యుత్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది.. ప్రభుత్వం లీగల్ ఒపినియన్ తీసుకుంటుంది, కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా అవ్వలేదు.. కొనసాగుతుందన్నారు.