నాంపల్లిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒక దశలో పోలీసులు నాంపల్లి ప్రధాన రహదారిని మూసి వేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయంపై రాళ్ళు, కోడిగుడ్లతో దాడికి దిగారు. దీంతో బీజేపీ కార్యాలయ అద్దాలు ధ్వంసం కావడంతో పాటు కార్యాలయంలో ఉన్న ఒక కార్యకర్త తలకు గాయాలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన బీజేపీ కార్.కర్తలు యువజన కాంగ్రెస్ కార్యాకర్తలపై కర్రలతో దాడి చేసి తరిమికొట్టారు. అంతేకాకుండా యూత్ కాంగ్రెస్ దాడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో నాంపల్లి పరిసర ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దఫల వారిగా బీజేపీ కార్యకర్తలు గాంధీ భవన్ కు నలుమూలల నుంచి తరలి వస్తుండటంతో ఆందోళనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు నాంపల్లి ప్రధాన రహదారిని మూసి వేశారు. అనంతరం వచ్చిన వారిని వచ్చినట్లుగా ఎక్కడికక్కడే అడ్డుకుని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఒక దశలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ కొంత మంది కార్యకర్తలు గాంధీ భవన్ పై రాళ్ళు విసిరారు. గాంధీ భవన్ పరిసర ప్రాంతాలలోని ఫ్లెక్సీలను చించివేసి భీభత్సం సృష్టించారు.
కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు చేసిన యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ నుంచి ర్యాలీగా బీజేపీ కార్యాలయం వరకు వెళ్లి ముట్టడించాలని యువజన కాంగ్రెస్ ముందుగాభావించింది. దీంతో పోలీసులు పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ వద్ద మెహరించారు. గాంధీ భవన్ వద్దకు వస్తే బయటకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుంటారని భావించి కొందరు యువజన కాంగ్రెస్ నాయకులు నేరుగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడి చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపైకి రాళ్లు రువ్వడం, యూత్ కాంగ్రెస్ నేతలపైన బీజేపీ కార్యకర్తలు కర్రలతో ఎదురు దాడికి దిగడం జరిగింది. విసిరారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యాలయంపై రాళ్లు విసరడంతో ఒక బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. బీజేపీ శ్రేణులు కర్రలతో కాంగ్రెస్ కార్యకర్తల వెంటపడ్డారు.పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ప్రియాంక గాంధీపై రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
యూత్ కాంగ్రెస్ దాడి, కర్యకర్తకు గాయాలైన అంశంపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని, దాడిలో కార్యాలయ అద్దాలు ధ్వంసం కావడంతో నష్టం వాటిల్లిందని పిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా రాళ్ళ దాడిలో గాయపడ్డ కార్యకర్తతో కూడా ఫిర్యాదును ఇప్పించారు. మరో వైపు గాంధీ భవన్ పై దాడికి సంబంధించిన అంశంపై కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇరు పక్షాల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు,
దాడులు సరికావు : కేంద్ర మంత్రి బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర ఆఫీస్‌పై కాంగ్రెస్ దాడిని కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా స్పందించారు. బీజేపీ తలుచుకుంటే గాంధీభవన్ పునాదులు కూడా మిగలవని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని, రాళ్ల దాడులను కాంగ్రెస్ ప్రోత్సహించాలనుకుంటోందా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతగానితనంగా భావించొద్దని, తప్పుడు వ్యాఖ్యలు ఎవరు చేసినా ఖండించాల్సిందేనని అన్నారు. తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలంటే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు. తక్షణమే దాడికి పాల్పడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
హింసకు తావులేదు : కిషన్ రెడ్డి
బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడి పట్ల కేంద్ర మంత్రి, పార్చీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యాల.ంపై దాడి చేస్తుంటే పోలీసులేం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ పార్టీ కార్యాలయాలకే రక్షణ కల్పించలేని అసమర్థ ప్రభుతక్వం రాష్ట్రంలో ఉందని విరుచుకుపడ్డారు. దాడులకు ప్రతిదాడులు చేస్తే కాంగ్రెస్ తట్టుకోలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. బీజేపీ ఎప్పుడూ హింసను ప్రోత్సహించదని, అలా అని హింసిస్తుంటే చూస్తూ ఊరుకోదన్నారు. యూత్ కాంగ్రెస్ నేతలు గుండాల్లాగా, రౌడీూల్లాగా ప్రవర్తించారని మండిపడ్డారు.
శాంతికి విఘాతం కల్పించొద్దు : టీపీసీసీ చీఫ్
రాష్చ్రంలో సాంతి భద్రతలను ఎవరు చేతుల్లోకి తీసుకున్నా సహించేది లేదని టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేసారు. యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయంపై దాడి చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. నిరసన తెలపొచ్చు కానీ దాడులకు పాల్పడటం సరైంది కాదన్నారు. అదే విధంగా బీజేపీ శ్రేణులు గాంధీ భవన్ పై దాడి చేయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు ప్రతిదాడులు చేస్తూ రాష్ట్రంలో హింసను ప్రేరేపించాలని బీజేపీ కుట్ర చేస్తుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. దాడులను నివారించే విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, ఎవరినీ ఉపేక్షించకూడదన్నారు. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి చేయడం, గాంధీ భవన్ పై బీజేపీ శ్రేణులు దాడి చేయడం సరైంది కాదన్నారు.
సీఎం క్షమాపణ చెప్పాలి : రాజాసింగ్
బీజేపీ కార్.ాల.ంపై కాంగ్రెస్ నేతల దాడి ఫట్ల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దాడులకు ప్రతిదాడులు తప్పవని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాల్సింది పోయి హింసను ప్రేపించే విధంగా కాంగ్రెస్ ప్రయత్నించడం దారుణమన్నారు. దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు.మేం తలచుకుంటే గాంధీ భవన్ ను తగలబెడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూత్ కాంగ్రెస్ దాడిపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.








